నల్లగొండ జిల్లాలో పరువు హత్య కలకలం (వీడియో)

నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో పరువు హత్య కలకలం రేపింది. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అనే వ్యక్తి 6 నెలల క్రితం అమృత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఆసుపత్రికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ప్రణయ్ మెడపై బలంగా దాడి చేశాడు. దీంతో కత్తి పోటుకు ప్రణయ్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. ప్రణయ్ ని హత్య చేసిన వీడియో కింద ఉంది చూడండి.

https://youtu.be/zSOHOXAKM2A

భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని దుండగుడు దాడి చేశాడు.  ప్రణయ్ ఆరు నెలల కిందట బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారే ఈ హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడు ఒక్క దెబ్బకే ప్రణయ్ ని చంపేశాడు. చాలా పదునైన కత్తితో దాడి చేయడంతో ప్రణయ్ మెడభాగం అంతా నుజ్జునుజ్జయింది. ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనతో మిర్యాలగూడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

హత్యకు గురైన ప్రణయ్