నల్లగొండ జిల్లాలో కూలిన ట్రైనింగ్ విమానం.. ఇద్దరు దుర్మరణం..

నల్లగొండ జిల్లాలో ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలెట్స్ మృతి చెందారు. ఈ ఘటన పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో చోటుచేసుకుంది. ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు చూట్టూ వ్యాపించాయి. విమానం ఒక్కసారిగా బలంగా కిందపడటంతో తునాతునకలైంది. ఫ్లైట్‌లో మహిళా పైలెట్‌తో సహా ట్రైనింగ్ ఫైలెట్ ఉన్నట్లు సమాచారం. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విమానం విద్యుత్ స్థంభంపై కూలడంతో భారీగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు