అమరావతిలో ఐటి సందడి, ఉరికొస్తున్న ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో ఒకేసారి 10 ఐటీ కంపెనీలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.

రాజధాని ప్రాంతంలోని తాడే పల్లి లోని ఇన్ఫోసైట్ భవనంలో  జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన  ఈ కంపెనీలు ప్రారంభించారు.

ఏపీ ఎన్ఆర్టి ఆధ్వర్యంలో ఈ 10 కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఈ 10 కంపెనీల ద్వారా సుమారుగా 1000 మంది యువతి,యువకులకు ఉద్యోగాలు లభిస్తాయని ఈ సందర్బంగా మాట్లాడుతూ లో కేశ్ తెలిపారు. తక్షణం 300 మంది స్థానిక యువతి,యువకులతో కంపెనీలు ప్రారంభమువతున్నాయని ఆయన చెప్పారు. ప్రారంభమయిన కంపెనీలు.

1)బిగ్ డేటా,ఐటీ సెక్యూరిటీ,ఈఆర్పీ,బిజినెస్ అనలిటిక్స్ అందిస్తున్న
వైబర్ టెక్ సొల్యూషన్స్ కంపెనీ

2.మొబైల్ యాప్ తయారీ లో
హెడ్ రన్ టెక్నాలజీస్

3.ఇంజినీరింగ్ డిజైన్స్ అందిస్తున్న క్యాడిప్లాయ్

4.ఐటీ మరియు కన్సల్టింగ్ సేవలు అందిస్తున్న సిఎస్ఎస్ టెక్నాలజిస్

5.అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ తయారీ లో ఉన్న యలమంచిలి

6.అప్లికేషన్ డెవలప్మెంట్ సర్వీసెస్ లో ఉన్న మెంటిస్

7.హెల్త్ కేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఉన్న నార్మ్ సాఫ్ట్ వేర్

8.ఓపెన్ ట్రక్ క్యాటరర్స్ సర్వీసెస్ అందిస్తున్న ఫ్రీమోన్ట్ ఐటీ సొల్యూషన్స్

9.కేపిఓ సర్వీసెస్ మరియు బిపిఓ సర్వీసెస్ అందిస్తున్న
యాక్ర్స్ ఐటీ సర్వీసెస్

10.గ్రాఫిక్ డిజైన్,మొబైల్ అప్లికేషన్ సేవలు అందిస్తున్న ప్రోకామ్