ట్రాఫిక్ పోలీసులతో పాతబస్తీ అమ్మాయి (వైరల్ వీడియో)

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులపై పాతబస్తీ మహిళలు విరుచుకుపడుతున్నారు. మొన్న మలక్ పేట ట్రాఫిక్ పోలీసులకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు అబిడ్స్ పోలీసులకు ఎదురైంది. ట్రాపిక్ నిబంధనలు పాటించకుండా వెళుతున్న ఓ మహిళను ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని లైసెన్స్ చూపించాలనగా చూయించను ఏం చేసుకుంటావో చేసుకోపో అని ఓ మహిళ బెదిరించింది. పోలీసులు బండి సీజ్ చేస్తామంటే చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. నిత్యం ఇటువంటి వారితో పోలీసులకు తలనొప్పులు వస్తున్నాయి. అబిడ్స్ లో ఆ మహిళ వ్యవహరించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. ఆ వీడియో కింద ఉంది మీరు కూడా చూడండి.