అమెరికా యాక్సిడెంట్ లో ఖమ్మం మహిళ మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా, కూసుమంచి గ్రామానికి చెందిన ఉడుత స్వర్ణ (30) మరణించారు. ఆమె భర్త, పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన వ్యాపారి కూరపాటి రఘఠునాథరావు చిన్న కూతురైన స్వర్ణను విజయవాడకు చెందిన ఉడతు కిరణ్ కుమార్ కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. కిరణ్ అమెరికాలోని చికాగో రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఏడాది క్రితమే కిరణ్ తన కుటుంబాన్ని అమెరికాకు షిఫ్ట్ చేశారు. 

వీకెండ్ కావడంతో కిరణ్, స్వర్ణ, ఇద్దరు కూతుళ్లు, స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లారు. సినిమా చూసి తిరిగి వచ్చే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి స్పీడ్ గా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారు డ్రైవింగ్ చేస్తున్న స్వర్ణకు, ముందు సీట్లో కూర్చున్న స్నేహితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెనుక సీటులో కూర్చున్న కిరణ్ కు, ఇద్దరు కూతుళ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి.

వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే కోమాలోకి వెళ్లిన స్వర్ణ మరో్ నాలుగు గంటల తర్వాత మరణించింది. ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు. 

ఏడాది క్రితమే అమెరికా షిఫ్ట్ అయిన స్వర్ణ రాఖీ వేళ తన సోదరుడు సందీప్ కు మిస్ యు రా అని మెసేజ్ చేసింది. తొలిసారి రాఖీ వేళ నీదగ్గర లేకపోవడం బాధగా ఉందని మెసేజ్ పెట్టింది. సందీప్ కు ఆన్ లైన్ లో రాఖీలు పంపింది స్వర్ణ. మిస్ యు రా అని సోదరుడికి మెసేజ్ పెట్టిన గంటల గ్యాప్ లోనే ఆమె మరణ వార్త వినడంతో కుటుంబసభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. 

కూసుమంచి గ్రామానికి చెందిన ఉడుత స్వర్ణ అమెరికాలోని చికాగో రాష్ట్రం లో ఉంటున్నారు. కుటంబసభ్యులంతా సినిమాకు వెళ్లి వస్తుండగా వారు ప్రయాణించే కారును వెనుకనుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో స్వర్ణ మరణించారు. కుసుమ భర్త 

రోడ్ ప్రమాదం లో మృతి చెందింది మృతురాలుకు ఇద్దరు కుమార్తెలు వారి వయసు 9మరియు 7 సంవతసరాలు వారు మరియు భర్త కిరణ్ కుమార్ సేఫ్ ఈరోజు మధ్యాహ్నం సినిమాకి వెళ్లి వస్తుండగా వేరు ప్రయాణించే కారును వెనకనుండి వచ్చిన కార్ డి కొట్టడం తో ప్రమాదం జరిగినట్లు మృతురాలి భర్త కుటుంబ సబ్యులకు ఫోన్ ద్వారా తెలియచేసారు