సైకిలిస్టుకు హెల్మెట్ లేదని జరిమానా (వీడియో)

జాతీయ రహదారిపై వేగంతో సైకిల్ నడిపాడని ఒక వ్యక్తికి రూ.500 చలానా విధించిన ఘటన కేరళలో గతవారం జరిగింది. వాసి కాసిం అనే వలస కార్మికుడు పని కోసం సైకిల్ పై వెళుతుండగా రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. మితి మీరిన వేగంతో వెళుతున్నందుకు రూ. 200ఓ జరిమానా చెల్లించాలని డిమాండ్ చేసారు. తాను రోజంతా కష్టపడితే రూ.400 వస్తాయని కాసిం బతిమాలుకుంటే చివరకు రూ.500 లతో సరిపెట్టారు. అంతే కాదు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నదంటూ , ఓ మహిళా పేరిట ఉన్న చలాన్ ను అతని చేతిలో పెట్టడం గమనార్హం. సైకిల్ టైర్లకు పోలీసులు  పంక్చర్ కూడా చేసారు. దీని వీడియో కాసిం బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి

ఇద్దరు అమెరికా ఆర్థిక వేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి