Pawan Kalyan – Akira: పవన్ తో అకిరా.. కొత్త లుక్ వైరల్!

పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు. అయితే, ఎప్పుడైనా తండ్రితో కలిసి దర్శనమిస్తే, ఆయన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతాయి. జనసేన విజయానంతరం అకిరా మరింతగా పవన్‌తో కనిపిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన దక్షిణాది ఆలయ దర్శన యాత్రలో అకిరా కూడా పాల్గొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించగా, అకిరా కూడా తన తండ్రికి తోడుగా అక్కడ ఉన్నాడు.

అకిరా తాజా లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మునుపటి ఫోటోలతో పోలిస్తే ఈసారి గడ్డం పెంచి మరింత మ్యాచ్యూర్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తెల్లటి కుర్తా, ట్రెడిషనల్ స్టైల్‌లో పవన్ లుక్‌ను ఫాలో అవుతున్నట్లు కనిపించడం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతోంది. అకిరా తన తండ్రి దారిలో నడుస్తాడా? ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడా? అనే చర్చలు నడుస్తున్నాయి.

తల్లి రేణు దేశాయ్ గతంలో అకిరాకు సినిమాలకన్నా సంగీతం ఎక్కువ ఇష్టమని పేర్కొంది. కానీ అకిరా తాజా లుక్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఇది హీరోగా ఎంట్రీకి సిగ్నల్ అంటూ భావిస్తున్నారు. పవన్ మాదిరిగానే స్టైలిష్ లుక్‌లో కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.

ఈ యాత్రలో అకిరా తన తండ్రికి మద్దతుగా కనిపించడం పవన్ అభిమానులకు ప్రత్యేకంగా అనిపిస్తోంది. ప్రస్తుతం అకిరా ఏ దిశగా వెళ్లబోతున్నాడనేది చూడాల్సి ఉంది. అయితే అభిమానుల అభిప్రాయాన్ని చూస్తే త్వరలో ఏదైనా ఆసక్తికరమైన అప్‌డేట్ రావొచ్చనే భావన బలంగా కనిపిస్తోంది.

బ్రహ్మి మాటలకు ఏడ్చేసిన చిరంజీవి || Brahmanandam EMOTIONAL Words On Chiranjeevi || Telugu Rajyam