సుజనా చౌదరి దెబ్బ రు. 6 వేల కోట్లు

 మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీకి ఎన్నోవిధాల వెన్నెముక గా నిలిచిన రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరి బ్యాంకును ముంచింది ఆరు వేల కోట్ల రుపాయలకని  ప్రభుత్వంమే స్వయంగా వెల్లడించింది.  ఆయన ఇళ్లు, కార్యాలయాల మీద నిన్న ఇడి (ఎన్ ఫోర్స్  మెంటు డైరెక్టొరేట్ అధికారులు) దాడుల చేసిన సంగతి తెలిసిందే. ఆయన మీద హవాల కేసులతో పాటు బ్యాంకులను ముంచిన కేసులు కున్నాయి. ఒక మలేషియా బ్యాంకు కథ హైదరాబాద్ హైకోర్టు దాకా వచ్చింది. అయితే, ఆపుడాయన మంత్రి.  ఎన్డీయేలో భా గస్వామి కాబట్టి ఇడి గాని, మోడీ గాని పట్టించుకోలేదు. ఇపుడు సుజనా చౌదరి పార్టీకి, ప్రధాని మోడీకి గొడవలొచ్చాయి కాబట్టి ఇడి విజృంభిస్తున్నది. కూపీలాగుతున్నది. సుజనా చౌదరి ఆర్థిక అవకతవకల మీద  ఎవరికీ అనుమాలుండవేమో. అయితే, కేంద్రం ధోరణే ప్రశ్నార్థకంగా ఉంది. చంద్ర బాబు నాయుడు మంత్రివర్గంలోకి తీసుకోండని సుజనా చౌదరి లాంటి ఆర్థికనేరస్థుడి పేరు ఇచ్చినపుడు తిరస్కరించాల్సి ఉండింది. అలా చేయలేదు. ఇపుడే మో  అత్యుత్సాహంతో దాడులు చేస్తున్నారు. ఇందులో రాజకీయాలు లేవని చెప్పలేం. అయితే, రాజకీయాల వల్లే ఇలాంటి విషయాలు బయటొకస్తాయి. ఇవెంతవరకు నిలుస్తాయో చూడాలి. స్నేహంగా ఉంటే మోదీ ఎంతటి నేరాన్నయిన వదిలేస్తాడని, సంబంధాలు తెగిపోతే, కత్తి దూస్తాడని అనుకోవాలి.

 

ఇదివేరే కథ,  ఇడి మాత్రం సుజనా చౌదరి, ఎంపిగారి బోగస్ కంపెనీలు చేసిన బ్యాంకుల ఫ్రాడ్ విలువ రు. 6000 కోట్ల అని ట్విట్టర్ లో వెల్లడించింది. దీన్ని రుజువు చేసి నేరస్థుని జైలుకు పంపగలరా? ఇవన్నీ బోగస్ కంపెనీలని, ఈ  కంపెనీల అడ్రసులేమిటి, మనిషి హిస్టరీ ఏమిటీ, ఇవి తిరిగొచ్చే అప్పులేనా వంటి విషయాలను ఇడి చెప్పాల్నా,  ఇవి తెలియనంతా అమాయకుల బ్యాంకు అధికారులు. అంతా మాయ.. కాదు, కాదు రాజకీయం.