Dulquer Salmaan: తమిళనాడు, కేరళలో ఈడీ దాడులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి లగ్జరీ కార్ల కేసులో భాగంగా ఈడీ అధికారులు సోదాలు చేసారు. భూటాన్ నుంచి లగ్జరీ కార్లు దిగుమతి చేసుకున్నారని దుల్కర్ సల్మాన్ నివాసంలో ఈడీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. ఒకేసారి 17 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి.
అటు నటుడు పృథ్వీరాజ్ నివాసంలో కూడా ఈడీ బృందాల సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ లో మొదటిసారి సోదాలు చేసిన ఈడీ ఇప్పుడు మరోసారి దాడులు నిర్వహిస్తోంది. కాగా గతంలో భూటాన్ నుండి వాహనాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులపై కస్టమ్స్ విభాగం కూడా దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఈడీ తాజా చర్యలు దర్యాప్తును కఠినతరం చేయడం, మరిన్ని ఆధారాలను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొచ్చి జోనల్ కార్యాలయం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA), 1999 కింద సోదాలు నిర్వహిస్తోంది.
ఖరీదైన లగ్జరీ వాహనాల అక్రమ రవాణాకు సంబంధించిన అక్రమ దిగుమతి, అనధికార విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. పనంపిల్లి నగర్ లోని నటుడు మమ్ముట్టి నివాసంతో పాటు, కొచ్చి, చెన్నై లోని దుల్కర్ సల్మాన్ నివాసాలపై కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. కోజికోడ్ లోని లగ్జరీ కార్ షోరూమ్ లలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈడీ సోదాలలో భాగంగా ప్రముఖుల పేర్లు, హీరోల పేర్లు వినిపిస్తుండడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Dulquer Salmaan: మరోసారి దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. చివరికి!
