తమిళనాడులో కుప్పకూలిన భవనం

తమిళనాడు రాజధాని చైన్నైలో పెను ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలి ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. కండందవాడి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 23మందిని రక్షించారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.