Upasana Mother: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రామ్ చరణ్ ఒకరు. ఇక రాంచరణ్ భార్య ఉపాసన గురించి వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఉపాసన తల్లి శోభన గురించి అందరికీ సుపరిచితమే ఈమె అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
ఇకపోతే తాజాగా ఉపాసన తల్లి శోభన చేసిన ఓ పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 60 సంవత్సరాల వయసు ఉన్న శోభన ప్రస్తుతం పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులతో పాటు ఆమె నెక్ లో ప్లేట్స్ ఉన్నా, ఇంకా పలు గాయాలు ఉన్నా తనకు తాను ఛాలెంజింగ్ గా తీసుకొని ఏకంగా హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్ పై ప్రయాణం చేశారు. ఇలా 600 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ఈ వయసులో ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇలా ఉపాసన పిన్ని ప్రీత రెడ్డితో పాటు శోభన చెన్నై వరకు సైకిల్ పై వెళ్లడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన అమ్మ గొప్పతనం గురించి తెలిపారు. వరల్డ్ సైకిల్ డే సందర్భంగా ఉపాసన తల్లి శోభన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో పాతిక సంవత్సరాల వయసు ఉన్నవాళ్లే ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ కొంత దూరం కూడా నడవలేని పరిస్థితిలలో 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈమె ఏకంగా 600 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.