ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న అనూష అనే విద్యార్ధిని మూడో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
అనూష స్వస్థలం సిద్దిపేట జిల్లా మందపల్లి. ఆమె పుస్తకంలో ఉన్న సూసైడ్ లెటర్ ను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని తాను బతికి ఉంటే సిద్దిపేటకు చెందిన నాగరాజుతో కలిసి ఉంటానని లేఖలో రాసింది.
ఒకవేళ తాను చనిపోతే నాగరాజును ఎవరూ ఏం అనకూడదని అనూష లేఖలో రాసింది. ప్రేమ వ్యవహారం వలనే అనూష ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.