విజయవాడలో మహిళ గొంతు కోసిన దుండగులు

విజయవాడలో దారుణం జరిగింది. సత్యనారాయణపురంలో ఓ ఇంట్లోకి చొరబడిన  దొంగలు దోపిడికి యత్నించారు. ఇంట్లో ఉన్న పద్మావతి అనే మహిళ ప్రతిఘటించడంతో  ఆమె గొంతుకోసి పరారయ్యారు. గమనించిన స్దానికులు పద్మావతిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.  విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ ఫుటేజిల ఆధారంగా కేసు విచారిస్తున్నారు.

సీసీ టివి ఫుటేజిలో రికార్డయిన నిందితుల విజువల్స్