ఎక్కడన్న ఏవన్నా తప్పులు చేస్తే ముందుగా ఎవరైనా చెప్పేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా.. పోలీసులకు చెప్పాలా అంటారు. కానీ ఆ పోలీసులే తప్పు చేస్తే ఇంకెవరికి చెప్పాలి. ఇటీవలె ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. సదరు పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ లో విధులను పక్కనపెట్టి మరీ ఒక చిన్నల్లు పెట్టి ఆయన రాసలీలలన్నీ కొనసాగిస్తున్నారు. చిన్నింట్లోనే ముద్దులు, మురిపాలు, రాసలీలలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ ను డీఐజీ సస్పెండ్ చేశారు. ఆ విషయంలో చాల బలహీనమైనా చింత చచ్చినా పులుపు చావలేదని సదరు ఇన్స్ పెక్టర్ కి వీధికో ‘చిన్న ఇళ్లు ‘ఉందని, చివరికి వ్యభిచార గృహాల్లో అకౌంట్లు (మహిళలతో ఎంజాయ్) పెట్టాడని, ఈయన పోలీస్ స్టేషన్ లో కంటే సదరు మహిళలతోనే ఎక్కువ గడపడానికి సమయం కేటాయిస్తున్నాడని వెలుగు చూడటంతో విసిగిపోయిన డీఐజీ ఆయన్ను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్ స్టేషన్ లో సెంథిల్ కుమారన్ (51) ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. సెంథిల్ కుమారన్ ఎప్పుడు పడితే అప్పుడు పోలీస్ స్టేషన్ కు వస్తాడని, ఫైళ్లు పరిశీలించడంలో పూర్తిగా నిర్లక్షం చేస్తున్నాడని, ఆయన ఏరియాల్లో శాంతిభద్రతలు కూడా సరిగా నిర్వర్తించడంలేదని అధికారులకు సమాచారం అందింది. ఆ విషయంలో చాలా వీక్ సెంథిల్ కుమారన్ కు భార్య, పిల్లలు ఉన్నారు. సెంథిల్ కుమారన్ ఆ విషయంలో (సంసారం) చాలా బలహీనత ఉన్నట్లు సమాచారం. అయితే సెంథిల్ కుమారన్ కు చింత చచ్చినా పులుపు చావలేదని తెలిసింది. సెంథిల్ కుమారన్ నవల్ పట్టు ప్రాంతంలో చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం సాగిస్తున్నాడని తెలిసింది.
ఎలెక్షన్ డ్యూటి సైతం ఢుమ్మాకొట్టారని ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వడంతో డీఐపీ సెంథిల్ కుమారన్ ను పిలిచి మందిలించారు. అయినా సెంథిల్ కుమారన్ మాత్రం ఆయన పద్దతి మార్చుకోలేదు. ఇటీవల తమిళనాడులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో సెంథిల్ కుమారన్ కు ప్రత్యే విధులు నిర్వహించాలని డీఐజీ ఆదేశాలు జారీ చేశారు పక్క వీధిలో సీఐ సరసాలు ఎన్నికల కౌంటింగ్ రోజు డీఐజీ సెంథిల్ కుమారన్ మొబైల్ ఫోన్ కు ఫోన్ చేశారు. మీరు ఎక్కడ ఉన్నారు అని డీఐజీ ప్రశ్నించిన సమయంలో తాను ఎలక్షన్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో డీఐజీ స్వయంగా ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చారు. అయితే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో లేని సెంథిల్ కుమార్ సమీపంలోని వ్యభిచార కేంద్రంలో మహిళలతో రాసలీలలు సాగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు. ఆ సమయంలో వ్యభిచార కేంద్రం నిర్వహకురాలు మాకు సీఐ సెంథిల్ కుమారన్ తెలుసని, ఆయనకు ఇక్కడి ఇద్దరి మహిళలతో సంబంధాలు (అకౌంట్లు) ఉన్నాయని స్వయంగా చెప్పింది. పోలీసులే ఇంత నీచానికి ఒడిగడితే ఇక మాములు జనం పరిస్థితి ఏమిటి.