పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

రంగులరాట్నం, ఉనికి, తెల్లవారితే గురువారం చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ చిత్ర శుక్లా పెళ్లిపీటలెక్కబోతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారితో చిత్ర శుక్లా ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

ఇక ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను చిత్ర శుక్ల సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా.. పులి, నేను శైలజ లాంటి సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌గా నటించి తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016 లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘మా అబ్బాయి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో ‘రంగుల రాట్నం’, సిల్లీ ఫెలోస్‌, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్‌, ఉనికి, హంట్‌ తదితర చిత్రాల్లో నటించింది.