Ram Pothineni: మొదటిసారి పోలీస్ అధికారిక పాత్రలో ఎనర్జిటిక్ స్టార్ రామ్….!

Ram Pothineni: పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించిన రామ్ పోతినేని, తర్వాత వచ్చిన రెడ్ సినిమాతో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు. తన నటనతో డాన్స్ తో స్టార్ హీరోగా కొనసాగుతున్న రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మాస్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కి “ది వారియర్” అనే టైటిల్ ను ఖరారు చేసారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంతవరకు తన కెరీర్లో చేయని పాత్రలు రామ్ కనిపించనున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు రామ్ తన కెరియర్లో ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ లేదు ఈ క్రమంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈమధ్య విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి ఆదరణ లభించింది. రామ్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు ఈ సినిమాలో తన పాత్ర విలక్షణంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం భాషలోకూడా విడుదల చేయనున్నారు అత్యంత భారీ బడ్జెట్ తో లింగుస్వామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి.

ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా విభిన్న పాత్రల ద్వారా మరోసారి ద్విభాషా చిత్రంలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హీరో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ద్వారా ఎలా నేర్పిస్తారు అనే ఆతృత ఎక్కువైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ ద్వారా ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.