Balakrishna: మరోసారి పోలీస్ అధికారిగా బాలకృష్ణ..!

Balakrishna: బాలయ్య బాబు అఖండ సినిమా థియేటర్స్ తోపాటు సినిమా అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చారు.ఇక ఓటిటి లో అడుగు పెట్టి చరిత్ర తిరగరాశారు. ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ తో టిఆర్ పి లెక్క మార్చేశారు. సీజన్ 1 ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి రెండో సీజన్ కోసం సిద్ధంవుతున్నారు .ఇక NBK @107ను మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయబోతున్నారు అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. క్రాక్ సినిమా హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తీయబోతున్న ఫిల్మ్ కావడం తో అంచనాలు పెరిగాయి. గోపీచంద్ మలినేని సినిమా తోపాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాని కూడా ఓకే చేసిన సంగతి తెలిసిందే.

ఎఫ్ 3 ప‌నుల్ని దాదాపుగా పూర్తి చేసేశాడు అనిల్ రావిపూడి. ఆ వెంట‌నే బాల‌కృష్ణ‌తో సినిమా ప‌ట్టాలెక్కిస్తాడు. ఇప్ప‌టికే ఈ సినిమా స్క్రిప్టులో అనిల్ రావిపూడి త‌ల‌మున‌క‌లై ఉన్నాడ‌ని టాక్‌. అనిల్ రావిపూడి సినిమాలోని బాలకృష్ణ పాత్ర గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులోనూ అనిల్ రావిపూడి ఈ సినిమాని పక్కా మాస్ సినిమాగా తీస్తానని అప్పుడే ప్రకటించేశారు.ఈ సినిమా లో బాల‌కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తార‌ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే రౌడీ ఇన‌స్పెక్ట‌ర్‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా చిత్రాల‌లో బాల‌య్య పోలీస్ అధికారిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తొలి సినిమా `ప‌టాస్‌` పోలీస్ క‌థే. అందులో… హీరోని నెగిటీవ్ యాంగిల్ లో చూపించి, వినోదం పంచిపెట్టాడు. ఈసారీ.. అదే జోన‌ర్‌లో అనిల్ రావిపూడి సినిమా తీయ‌బోతున్నాడ‌ట‌. ఈ వార్త విన్న అభిమానులు మాత్రం వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు.