అక్కడ 30 రూపాయలకే కిలో జీడిపప్పు కొనుగోలు చేయవచ్చట.. ఎలా సాధ్యమంటే?

మన దేశంలోని అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు ఒకటి కాగా జీడిపప్పును తినడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. మార్కెట్ లో కిలో జీడిపప్పు ధర కనీసం 800 రూపాయల నుంచి గరిష్టంగా 1000 రూపాయల వరకు ఉంటుంది. జీడిపప్పు ఖరీదు ఎక్కువ మొత్తం కావడంతో చాలామంది జీడిపప్పును కొనుగోలు చేయడానికి అస్సలు ఇష్టపడరు.

అయితే మన దేశంలోని ఒక ప్రాంతంలో మాత్రం కిలో జీడిప్పును కేవలం 30 రూపాయలకు కొనుగోలు చేయవచ్చట. జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్తారా జిల్లాలో ప్రసిద్ధ డ్రై ఫ్రూట్ జీడిపప్పును ఇంత తక్కువ మొత్తానికి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది. గ్రామంలో ఎక్కువ భూభాగంలో జీడిపప్పును సాగు చేస్తుండటంతో ఇతర ప్రాంతాలతో పోల్చి చూస్తే మాత్రం ఇక్కడ జీడిపప్పు ధర తక్కువగా ఉందని తెలుస్తోంది.

జమ్తారా ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటంతో ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ మొత్తానికే జీడిపప్పు లభిస్తుండటం గమనార్హం. ఇక్కడ 50 ఎకరాలలో జీడిపప్పుకు సంబంధించిన చెట్లు ఉన్నాయి. అయితే తక్కువ రేటుకు అమ్మడం వల్ల తమకు ప్రయోజనం లేదని ఇక్కడి రైతులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడి రైతులకు బెనిఫిట్ కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

జీడి రైతుల విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇక్కడి రైతులు ఆన్ లైన్ ద్వారా జీడిపప్పులను విక్రయిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారాలు చేయాలని భావించే వాళ్లకు ఈ వ్యాపారం బెస్ట్ అని చెప్పవచ్చు.