మాస్ మహారాజా రవితేజ , ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. వరస ఫ్లాఫ్ ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంకు దర్శకత్వం వహించటంతో మొదట్లో సినిమాపై పెద్దగా ఎక్సపెక్టేషన్స్ లేవనే చెప్పాలి. కాని ఫస్ట్ లుక్ టీజర్ మరియు ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకు మంచి హైప్ వచ్చింది.
ఇక ఇప్పటికే యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. కొంతమందైతే సినిమా చాలా బాగుందని, ఇది పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని,శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అంటున్నారు. అయితే కొన్ని చోట్ల నుంచి అందిన రిపోర్ట్ ప్రకారం అయితే రొటీన్ యాక్షన్ సినిమా అని తేల్చేస్తున్నారు.
ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు అశోశియేషన్స్ ని వెటకారం చేస్తూ తీసిన వాటా కామెడీ కామెడీ సీన్స్ బాగా పాతాకాలం నాటివిలా ఉండి, నవ్వించలేకపోయాయని సమాచారం. ఈ కథలో ఎలాగైనా కామెడీని ఇరికించాలని ఫోర్సెడ్ గా కలిపినట్లున్నాయంటున్నారు. ఫస్టాఫ్ ఓకే అనుకున్నా…సెకండాఫ్ పెద్ద గొప్పగా ఏమీ లేదని, తన ఫార్ములానే నమ్ముకుని దూకుడు లో క్లైమాక్స్ ముందు వచ్చే ఫార్స్ తరహా సీన్స్ నే మళ్ళీ రీక్రియేట్ చేసాడట. క్లైమాక్స్ అన్ని యాక్షన్ సినిమాల మాదిరిగానే ఓ పెద్ద ఫైట్ తో ముగుస్తుంది.
యాక్షన్ ఎమోషన్ తో పాటు ఫుల్ ఎంటర్ టైనర్ ఈ చిత్రంలో ఉంటుందని చిత్ర దర్శక,నిర్మాతలు ప్రచారం మొదట నుంచీ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో మంచి కామెడీ సీన్స్ ఉన్నాయని కమిడియన్స్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇలా భారీ ఎత్తున అంచనాల నడుమ విడుదల అయిన అమర్ అక్బర్ ఆంటోనీ శ్రీనువైట్ల, రవితేజలకు సక్సెస్ ఇస్తుందా, ఈ చిత్రంతో ఇలియానా సక్సెస్ తో రీ ఎంట్రీ ఇవ్వనుందా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కింది.
చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.