నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక్క భాగం గానే మొదట ప్లాన్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అంటూ రెండు భాగాలు చేసారు. తొలి భాగం కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలు. రెండో భాగం మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు.
ఇక మొదట ఈ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న, యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. తాజాగా యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్‌ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 24న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే వాయిదా కారణమేమిటనేది మాత్రం తెలియరాలేదు. డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడితోనే ఫోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం. మొదటి పార్ట్ రిలీజ్ కు రెండో పార్ట్ రిలీజ్ కు మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే తాము పెట్టిన పెట్టుబడి రికవరీ అవ్వదని, రిలీజ్ డేట్ మార్చమని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పుకుంటున్నారు.