బాక్సాఫీస్ : వాష్ అవుట్ అయ్యిపోయిన “లైగర్”..ఫైనల్ గా ఎంత నష్టం అంటే.!

టాలీవుడ్ లో సడెన్ రైజింగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “లైగర్” కోసం అలాగే దాని ఓపెనింగ్స్ కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతో కాలం గ్యాప్ తీసుకొని చేసిన ఈ చిత్రం తన కెరీర్ లోనే ఒక వరస్ట్ వర్క్ గా నిలిచిపోయింది.

హీరో విజయ్ దేవరకొండ ఎఫర్ట్స్ పక్కన పెడితే సినిమాని దర్శకుడు పూరి అసలు తన కెరీర్ లోనే చెత్త సినిమాలా చేసాడని ట్రేడ్ వర్గాలు చెప్పారు. అయితే పాన్ ఇండియా వైడ్ అప్పుడు అంటే సినిమాపై ఉన్న హైప్ లో భారీ వసూళ్లు మొదటి రోజు వచ్చేసాయి కానీ సినిమాలో మ్యాటర్ లేదని తేలిపోవడంతో సినిమా థియేటర్స్ లో తేలిపోయింది.

దీనితో ఈ చిత్రం అనుకోని డిజాస్టర్ అయ్యిపోయింది. ఇక ఈ వారం థియేటర్స్ లో వరుస సినిమాలు రావడం వాటిలో కొన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లైగర్ కంప్లీట్ గా వాష్ అవుట్ అయ్యిపోయినట్టుగా చెబుతున్నారు సినీ ప్రముఖులు.

దీనితో ఈ సినిమా కి టోటల్ గా బాక్సాఫీస్ దగ్గర సుమారుగా 70 కోట్ల భారీ నష్టాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో చిన్న హీరోస్ లోనే కాకుండా పెద్ద హీరోల సినిమాల్లో కూడా ఈ చిత్రం రికార్డు లాసులు నమోదు చేసిన సినిమాగా మిగిలిపోయింది.