‘డియర్ కామ్రేడ్‌’కి పెద్ద దెబ్బ, కలెక్షన్స్ ని కాటేస్తుంది

‘డియర్ కామ్రేడ్‌’కి మరో పెద్ద దెబ్బ, కలెక్షన్స్ పై పడుతుంది

విజయ్‌ దేవరకొండ హీరోగా భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ డ్రామా డియర్‌ కామ్రేడ్‌. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. సినిమా నిడివి, స్లో నేరేషన్‌లపై విమర్శలు వినిపించాయి. అయితే సినిమాపై భారీ హైప్ క్రియేట్ కావటం, విజయ్‌ దేవరకొండ ఫాలోయింగ్‌ అ‍న్ని కలిసి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఆనందం టీమ్ కు మిగల్చ నిచ్చేటట్లు కనపడటం లేదు తమిళ రాకర్స్.

డియర్ కామ్రేడ్ చిత్రం నిన్న విడుదల అవ్వడమే ఆలస్యం మొత్తం సినిమాని లీక్ చేసారు తమిళ రాకర్స్ . ఇప్పటికే చాలా సినిమాలు విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు తమిళ రాకర్స్ . అదే కోవలో తాజాగా డియర్ కామ్రేడ్ కూడా పైరసీ బారిన పడటం అభిమానులను ,సినిమా ప్రియులను బాధిస్తోంది . అప్పటికీ నిర్మాతలు డియర్ కామ్రేడ్ చిత్రాన్ని పైరసీ చేయకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా,వాటిని దాటి అవలీలగా దాన్ని పైరసీ చేసేసారు .

ఈ సినిమా లీక్ తో మరోసారి దర్శక నిర్మాతలకు , హీరోలకు సవాల్ విసురుతున్నారు తమిళ రాకర్స్ . అసలే డియర్ కామ్రేడ్ చిత్రానికి నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది . ఇలాంటి సమయంలో పైరసీ కూడా తోడైతే ఈ సినిమా గట్టెక్కడం కష్టమే అని ట్రేడ్ లో కామెట్స్ వినిపిస్తున్నాయి. డియర్‌ కామ్రేడ్ సినిమా తొలి రోజు 11 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శని, ఆది వారలు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు.