సమంతకు ఆ మాట కనుక చెప్పితే చాలా కోపం వస్తుంది.. అసలు విషయం చెప్పిన జిమ్ ట్రైనర్!

సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా బెడ్ కు పరిమితమయ్యారు. ఇలా ఈమె బెడ్ మీద నుంచి యశోద సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు. అలాగే ఈమె తాజా చిత్రం శాకుంతలం సినిమాకి డబ్బింగ్ కూడా బెడ్ పైనుంచి చెప్పినట్టు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా సమంత మయోసైటిసిస్ వ్యాధి నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె జిమ్ లో సందడి చేస్తుంది.

ఇలా అనారోగ్యం నుంచి కోలుకున్నటువంటి సమంత మెల్లిగా తన పనిలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత జిమ్ ట్రైనర్ సమంత గురించి ఒక పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఈరోజు సమంతకు హాలిడే అని కనుక చెబితే తన వైపు ఇలా చూస్తుంది అంటూ మీ ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లోని ఒక పోస్టర్ ను షేర్ చేశారు. అయితే సమంత మాత్రం ఈరోజు మంచి రోజు నేను వీక్ గా ఉన్న చాలా స్ట్రాంగ్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సమంత విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. అయితే సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇక సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవడంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె నటించిన శాకుంతలం సినిమా వచ్చే నెలలో విడుదల కానున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.