బాక్సాఫీస్ రిపోర్ట్ : ఫస్ట్ డే “బింబిసార” వసూళ్లు..కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే రికార్డ్.!

నందమూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “బింబిసార” తో మళ్ళీ తెలుగు సినిమా దగ్గర భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. దీనితో తెలుగు బాక్సాఫీస్ దగ్గర థియేటర్స్ కళకళలాడడం స్టార్ట్ అయ్యింది.

ఇక దీనితో డిస్ట్రిబ్యూటర్ లు కూడా కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా బింబిసార అధికారిక వసూళ్లు అయితే మేకర్స్ చెబుతున్న దాని ప్రకారం ఏపీ మరియు తెలంగాణాలో 6.3 కోట్లు షేర్ ని అలాగే 9 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిందట.

దీనితో ఇక్కడ జరిగిన రెండు రాష్ట్రాల బిజినెస్ లో సగం ఏకంగా ఈ ఒక్క రోజులోనే రాబట్టేసినట్టుగా తెలియజేసారు. అలాగే ఈ వసూళ్లు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే రికార్డు వాసులుగా చిత్ర ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. దీనితో అయితే మొత్తానికి బింబిసార బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్య కాలంలో జెన్యూన్ ఓపెనింగ్స్ రాబట్టింది చెప్పి తీరాలి.

మరి ఇంకా ఓవర్సీస్ లో సహా వరల్డ్ వైడ్ వసూళ్ల అధికారిక వివరాలు అయితే రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట పని చేయగా క్యాథరిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే కళ్యాణ్ రామ్ నే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించాడు.