బాక్సాఫీస్ : మైండ్ బ్లాక్ చేస్తున్న “బ్రహ్మాస్త్ర” వసూళ్లు..రెండు రోజుల్లో ఎంతంటే!

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన మరో అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “బ్రహ్మస్త్ర”. తెలుగు బ్రహ్మాస్త్రం గా రిలీజ్ చేసిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా నటించగా మన టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున మరియు షారుఖ్ ఖాన్, అమితాబ్ లాంటి మారియో స్టార్ బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటించారు.

అయితే భారీ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకోగా రెండో రోజు కూడా మైండ్ బ్లాకింగ్ వసూళ్లు అందుకున్నట్టు ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఫస్ట్ డే 75 కోట్లు అందుకున్న ఈ సినిమా ఏకంగా రెండో రోజుకి 160 కోట్లు తో అదరగొట్టేసిందట.

దీనితో ఈ భారీ చిత్రం రెండో రోజే మరింత స్థాయిలో రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే ఈ వసూళ్ల పరంగా చూసినట్టు అయితే హిందీలో మొదటి రోజు 36 కోట్లు రాగా రెండో రోజు ఇంకా ఎక్కువ నమోదు అయ్యాయట అంతే కాకుండా తమిళ్ లో సుమారు రెండు రోజులకి గాను 3.8 కోట్లు వచ్చాయట.

ఇక మన తెలుగులో అయితే రెండు రోజుల్లోనే సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా ఓవర్సీస్ లో వసూళ్లు చూసుకున్నా ఓవరాల్ గా రియల్ లెక్కలు 130 నుంచి 150 కోట్లు అయినా వచ్చి ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. మొత్తానికి అయితే ఈ సినిమా మాత్రం మైండ్ బ్లాకింగ్ నంబర్స్ సెట్ చేస్తుందని చెప్పి తీరాలి.