గత కొన్నాళ్ళు నుంచి అయితే ఇండియన్ సినిమా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రం “ఆనిమల్” ఓటిటి వెర్షన్. మరి ఈ చిత్రం థియేటర్స్ లో భారీ హిట్ అయ్యిన తర్వాత ఓటిటిలో కూడా చూడాలని చాలా మంది ఎదురు చూసారు కానీ సినిమాపై ఓ నిర్మాత కేసు పెట్టడంతో సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది అందరిలో సస్పెన్స్ గా మారింది.
కానీ ఈ చిత్రం ఫైనల్ గా ఆ హర్డల్స్ ని దాటుకొని ఈరోజు నుంచి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసింది. కాగా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన వారు చిన్న ట్విస్ట్ ఇచ్చారు. నిజానికి ముందు ఈ సినిమా సుమారు 8 నిమిషాలు అలా ఎక్స్ట్రా ఫుటేజ్ తో వస్తుంది అని టాక్ ఉంది.
అయితే ఇపుడు వచ్చిన సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఓపెన్ చేస్తే 3 నిమిషాల ఎక్స్ట్రా రన్ టైం తో కనిపిస్తుంది. కానీ సినిమా ప్లే చేస్తే మళ్ళీ థియేటర్స్ లో వచ్చిన ఒరిజినల్ వెర్షన్ 3 గంటల 21 నిమిషాలు మాత్రమే చూపిస్తుంది. దీనితో కనీసం మూడు నిమిషాలు అయినా ఎక్స్ట్రా వచ్చింది అని ఆవేశపడి ఓపెన్ చేసిన వారికి నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఇలా ట్విస్ట్ ఇచ్చారు.
మరి దీనికి గల కారణం ఏంటో వాళ్ళకే తెలియాలి. కాగా ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వర్క్ చేయగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే త్రిప్తి దిమిరి మరో హీరోయిన్ గా నటించింది.