ఓటిటిలో RRR రికార్డ్స్ బ్రేక్ చేసిన “ఆనిమల్” సెన్సేషన్..!

మన ఇండియన్ సినిమా దగ్గర నుంచి వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అయితే మన సౌత్ నుంచి వెళ్లిన సినిమాలే ఎక్కువ ఉన్నాయని చెప్పాలి. కాగా మన నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి ఉన్న చిత్రాల్లో కూడా మన సౌత్ నుంచి దర్శకులు చేసిన సినిమాలు కూడా ఉండగా ఈ చిత్రాల్లో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన ఆ సెన్సేషనల్ హిట్ చిత్రమే “ఆనిమల్”.

కాగా తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మొన్ననే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. అయితే బాక్సాఫీస్ తర్వాత ఓటిటిలో కూడా ఇప్పుడు ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఇండియన్ సినిమా దగ్గర మాసివ్ హిట్ అయినటువంటి చిత్రాల్లో మన ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.

కాగా ఈ చిత్రం ఓటిటిలో అయితే ఇండియాలో ఏ సినిమా కూడా కొల్లగొట్టని రికార్డ్స్ సెట్ చేసి ఆల్ టైం హైయెస్ట్ రికార్డుని ఓటిటిలో మొదటి రోజు నుంచే అందుకుంది. కానీ ఇప్పుడు దీనికి ఆనిమల్ సమాధానం చెప్పింది. విడుదల అయ్యిన మొదటి 10 రోజుల్లో ఐతే గ్లోబల్ ఛార్ట్స్ లో ట్రెండ్ అవుతూ ఇప్పుడు వరకు నెట్ ఫ్లిక్స్ లో ఉన్న ఆల్ టైం హైయెస్ట్ రికార్డ్స్ ని ఈ చిత్రం బ్రేక్ చేసి నెంబర్ 1 సినిమాగా నిలిచింది.

దీనితో RRR సినిమాని రెండో స్థానంలోకి నెట్టేసింది. మొత్తానికి అయితే ఓటిటిలో కూడా ఆనిమల్ సినిమా హవా మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో రష్మికా మందన్నా త్రిప్తి దిమిరి హీరోయిన్స్ గా నటించగా టి సిరీస్ నిర్మాణం వహించారు. అలాగే దీనికి సీక్వెల్ “ఆనిమల్ పార్క్” కూడా ఉంది.