బిగ్ అప్డేట్ : “ఆనిమల్” ఓటిటి డేట్ ఖరారు..!

గత డిసెంబర్ లో ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ గా నిలిచిన పలు చిత్రాల్లో బాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. మరి అటు హిందీ సహా తెలుగులో కూడా రోరింగ్ రెస్పాన్స్ తో అదరగొట్టేసిన ఈ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అది కూడా మూడు గంటల 20 నిమిషాల సేపు అందులోని ఏ సర్టిఫికెట్ సినిమా సుమారు 900 కోట్లు కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా నిలిచింది. కాగా మొత్తానికి ఈ చిత్రం థియేటర్స్ కి రన్ ని కంప్లీట్ చేసుకుంది కానీ ఇంకా ఓటిటి లో రిలీజ్ కి రావాల్సి ఉంది.

కాగా గత కొన్నాళ్ల నుంచి సినిమా ఓటిటి రిలీజ్ పై కోర్టులో ఓ కేసు నడుస్తుండగా దీనితో సినిమా ఓటిటి లో ఇప్పుడప్పుడే రాదు అని కొన్ని పుకార్లు వహ్చాయివచ్చాయి. కానీ దీనికి ఇప్పుడు మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చేసారు. సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న డేట్ జనవరి 26నే వస్తున్నట్టుగా ఆనిమల్ యూనిట్ చెప్పకనే చెప్పేసారు.

సోషల్ మీడియాలో తాజాగా ఛాంపియన్ కి సెల్యూట్ చేద్దాం అంటూ ఇండియా ఫ్లాగ్ తో కూడిన రిప్లై సలార్ యూనిట్ కి ఇచ్చారు. అంటే ఈ జనవరి 26 రిపబ్లిక్ డే కనుకగానే సినిమా ఓటిటిలో వస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. కాగా ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై ఒక్క అఫీషియల్ క్లారిటీ మాత్రం రావడం బాకీ ఉంది. ఇంకా ఈ సినిమాని సందీప్ వంగ దర్శకత్వం వహించగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.