లేటెస్ట్ : ఫైనల్ గా “ఆనిమల్” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది 

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన చిత్రాల్లో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఏ సర్టిఫికెట్ చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. కాగా ఈ చిత్రంని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించాడు. అలాగే రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించింది.

అయితే  థియేటర్స్ లో మంచి హిట్ అయ్యి ఓటిటి రిలీజ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే కొన్ని కోర్ట్ కేసులు ట్విస్ట్ లు అనంతరం ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఈ నెట్ ఫ్లిక్స్ వారు ఎట్టకేలకి ఈ రోజు ఆ డేట్ ని రివీల్ చేశారు.

ఇంట్రెస్టింగ్ ప్రోమోతో ఈ జనవరి 26 నుంచి అంటే రేపు నుంచే పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో గత కొన్ని రోజులు నుంచి సస్పెన్స్ గా మారిన ఆనిమల్ ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు ఓ ఫైనల్ క్లారిటీ వచ్చేసింది అని చెప్పవచ్చు.

కాగా ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటించగా ఈ సినిమాతో యంగ్ హీరోయిన్ త్రిప్తి దిమిరి కూడా కీలక పాత్రలో నటించగా ఈమె ఈ సినిమా తర్వాత భారీ ఫేమ్ ని తెచ్చుకుంది. అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రం తర్వాత అనిమల్ పార్క్ అంటూ సీక్వెల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.