మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ అంటోనీ’. ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మార్నింగ్ షోకే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే అప్పటికే బుక్ అయ్యిన టిక్కెట్లు, వీకెండ్ కు వెళ్దామనుకున్న ఫిక్సైన వాళ్లను రివ్యూలు, టాక్ పెద్దగా ప్రభావితం చేయలేదు. దాంతో ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది.
తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు గానూ రూ.. 3.42 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ ని ఆశ్యర్యపరిచింది. రవితేజ గత చిత్రం ‘నేల టికెట్’ మొదటి రోజు కలెక్షన్స్ రూ.3.47 కోట్లు. అంటే పెద్ద డ్రాప్ లేదు. అంటే రవితేజ క్రేజ్ ఉంది. సరైన సినిమానే పడటం లేదని అర్దమవుతుంది.
ఇక రెండో రోజు విషయానికి వస్తే… ‘అమర్ అక్బర్ అంటోనీ’ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ గా డ్రాప్ అయింది. ఓవర్ సీస్ లోనూ అదే పరిస్దితి. మరో ప్రక్క వివిధ వివాదాల మధ్య రిలీజైన విజయ్ దేవరకొండ చిత్రం టాక్సీవాల ఓపినింగ్స్ బాగా తెచ్చుకుంది. ఆ దెబ్బ కూడా ఈ సినిమాకు తగిలింది. ప్లాఫ్ టాక్ కు తోడు ఈ సినిమా రిలీజ్ తో ఈ సినిమా డ్రాప్స్ భారీ గా ఉన్నాయి. ఆల్ మోస్ట్ 60% వరకు డ్రాప్స్ ని సినిమా తొలి రెండు షోల కి సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత పుంజుకున్నా అది ఆశించిన విధంగా అయితే లేదని సమాచారం.
దాంతో రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 1.5 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుందని తెలుస్తుంది. వీకెండ్ ల నైట్ షోల లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటేనే ఇప్పుడున్న పరిస్దితుల్లో కొద్దిలో కొద్ది రికవరీ ఉంటుంది. లేకపోతే కష్టమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.