బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ ఆత్మహత్యలో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకొస్తుంది. ఇప్పటికే సుషాంత్ తల్లిదండ్రులు రియా చక్రవర్తిపై పాట్నాలో ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసుల్ని కోరగా…రియా చక్రవర్తి సీబీఐ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉంది. అంతకు ముందు నెపోటిజం కారణంగా మనస్థాపం చెందిన సుషాంత్ ఆత్మ హత్య చేసుకున్నట్లు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ కేసు విషయంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేసారు.
ఇది ఆత్మహత్య కాదు..హత్యేనంటూ బలంగా ఆరోపిస్తున్నారు. సుషాంత్ తన మరణానికి ఉపయోగించి క్లాత్, మెడపై ఉన్న గుర్తుకు సరిపోకపోవడం, మెడపై అక్కడక్కడా ఉన్న గాట్లు అనుమానాలకు కారణమైతే..ఆ సమయంలో సీసీ టీవీ పుటేజీ మాయం కావడం, ఆ రూమ్ డూప్లికేట్ కీ మిస్ అవ్వడం, సిమ్ కార్డులు, అతని మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, పనివాడు తప్పుడు వాగ్ములం వంటివి చాలా అనుమానాలు దారి తీస్తున్నాయని మాజీ మంత్రి ఆరోపించారు. తను ఆర్ధికంగా ఇబ్బందుల్లో లేడు. అందమైన జీవితం ముందుంది..క్రేజ్ ఉంది. అలాగే ఓ నటిని అనవసరంగా ఇందులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని..ఇది కచ్చితంగా హత్యేనని గట్టిగా చెబుతున్నారు.
కేంద్ర మాజీ మంత్రి చేసిన ఆరోపణల్లో కొన్ని నిజాలున్నాయి. ఇక సుషాంత్ బలవన్మరణాకిని పాల్పడిన దగ్గర నుంచి అతని కుటుంబ సభ్యులు ఇది కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్న సంగతి తెలిసింతే. తెలివైన కుర్రాడు…అన్ని విషయాలు తెలిసిన వాడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాడని సుషాంత్ తల్లిదండ్రులు గట్టిగా చెప్పారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజా నిజాలు తేలుతాయని సుషాంత్ బంధువులు అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో 40 మంది నుంచి వాంగ్ములం తీసుకున్నారు. ఇందులో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలే ఉన్నారు.
https://twitter.com/Swamy39/status/1288645048830222339?s=19