Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ కి ట్రైన్ లో చేదు అనుభవం.. అసభ్యంగా ప్రవర్తిస్తూ ముద్దు ఇస్తావా అని అడిగాడంటూ!

Malavika Mohanan: హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి మనందరికీ తెలిసిందే. నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. ముఖ్యంగా తంగలాన్ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటివరకు మలయాళం తమిళ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మోహనన్ తనకు ఎదురైనా ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాను. అలా ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. రాత్రి నా స్నేహితులతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా కంపార్ట్మెంట్ వద్ద ఉన్న గ్లాస్ డోర్ నుంచి ఒక వ్యక్తి మా వైపు చూస్తున్నాడు. అలా చూస్తూ ముద్దు ఇస్తావా అని సైగలు చేశాడు.

ఆ సమయంలో నేను భయాందోళనకు గురయ్యాను. ముంబై లాంటి నగరంలో మహిళలకు భద్రత లేదు అని మాళవిక మోహనన్ తెలిపింది. మాళవిక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దానిపై స్పందించిన ముంబై పోలీసులు.. మాళివిక గారు మేము మీ గురించి వార్తల్లో చూశాం.. మీకెదురైన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అనుభవాలు ఆశ్చర్యకరంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. నగరంలో రోజులో ఏ సమయంలో లేదా ఏ ప్రదేశంలోనైనా దయచేసి 112 లేదా 100 నంబర్‌ లో మమ్మల్ని సంప్రదించండి. మేము వీలైనంత త్వరగా మీకు అండగా నిలుస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.