ఎంపీ గోరంట్ల మాధవ్ ఎఫెక్ట్: వైసీపీకీ ‘డర్టీ’ నేమ్.!

తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగల పార్టీగా అభివర్ణిస్తుంటుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే. వైఎస్సార్సీపీ మీద కూడా టీడీపీ తరచూ ఏదో ఒక సెటైరికల్ వ్యాఖ్యలు చేస్తుంటుంది. అయితే, ఈసారి ఇంకాస్త అసభ్యకరమైన పేరుని వైసీపీకి పెట్టింది తెలుగుదేశం పార్టీ.

యువజన శృంగార రసిక చిలిపి పార్టీ.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోంది. ‘లేడీ సీఎం జగన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేస్తూ టీడీపీతోపాటు, జనసేన కూడా ఈ ‘యువజన శృంగార రసిక చిలిపి పార్టీ’ అంటూ వైసీపీ మీద సెటైర్లు వేస్తోంది.

దీనంతటికీ కారణం హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ‘గోరంట్ల మాధవ్ తప్పు చేసి వుంటే.. కఠిన చర్యలు తప్పవు..’ అని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారుగానీ, ఇంతవరకు చర్యలైతే తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో వైసీపీ మీద టీడీపీ, జనసేనతోపాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. గతంలో ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా వైసీపీ అలసత్వం ఆ పార్టీ కొంప ముంచింది. ఎమ్మెల్సీ అనంతబాబు, తన వద్ద కారు డ్రైవరుగా పని చేసిన దళిత యువకుడ్ని కొట్టి చంపిన కేసులో ఉదాసీనంగా వ్యవహరించింది వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వం.

‘ఆయన తప్పు చేసి వుండకపోవచ్చు.. అందుకే ధైర్యంగా తిరుగుతున్నాడేమో..’ అని అప్పట్లో మంత్రి బొత్స తేలిక వ్యాఖ్యలు చేశారు. అయితే, గోరంట్ల మాధవ్ విషయంలో ‘కఠిన చర్యలు తప్పవు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. తీరిగ్గా అనంతబాబుని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారుగానీ, ఎమ్మెల్సీ పదవికి ఆయనతో రాజీనామా చేయించలేకపోయారు.

మరి, గోరంట్ల మాధవ్ విషయంలో ఏం జరుగుతుంది.? ఆలస్యం అమృతం విషం.. చర్యలు ఆలస్యమయ్యే కొద్దీ, వైసీపీకి ఈ ఘటనతో మరింత చెడ్డపేరు వస్తుం