Liquor Revenue: ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సంచలన ఆరోపణలు: మద్యం ఆదాయానికి లీకేజీలతో గండి!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా లీకేజీ అవుతోందని, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించింది. ప్రభుత్వ గణాంకాలను, కాగ్ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ ఈ మేరకు ఒక ట్వీట్ విడుదల చేసింది.

కూటమి సర్కార్ గతేడాది కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చి, గత వైసీపీ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకున్న మద్యం వ్యాపారాన్ని తిరిగి ప్రైవేట్ వారికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ విధానం వల్ల అవినీతి తగ్గుతుందని, పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం వాదించింది. అయితే, ఈ విధాన మార్పు తర్వాత కూడా మద్యం ఆదాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని వైసీపీ ప్రశ్నించింది.

PCC President Welcomes Mallanna Party: ‘తీన్మార్ మల్లన్న కొత్త పార్టీకి స్వాగతం’ – పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్

Telangana Rajyadhikara Party: టీఆర్‌పీ పార్టీని స్థాపించిన తీన్మార్‌ మల్లన్న: జెండాను ఆవిష్కరించిన చింతపండు నవీన్‌

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఆదాయాలు భారీగా పెరుగుతాయని ఆశించారు. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయాలు రూ. 6,782.21 కోట్లుగా ఉంటే, 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో అవి రూ. 6,992.77 కోట్లకు మాత్రమే పెరిగాయి. కాగ్ గణాంకాలను బట్టి చూస్తే, ఈ పెరుగుదల కేవలం 3.10% మాత్రమే. సాధారణ పరిస్థితుల్లో, విధాన మార్పులు చేయకపోయినా ఎక్సైజ్ ఆదాయాల్లో కనీసం 10% వృద్ధి ఉంటుందని వైసీపీ పేర్కొంది.

అయితే, ప్రస్తుత వృద్ధి శాతం గణనీయంగా తగ్గడంతో మద్యం వ్యాపారంలో భారీ అవినీతి జరుగుతోందని, లీకేజీల వల్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరకుండా పోతోందని వైసీపీ ఆరోపించింది.

ఈ లీకేజీల వల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Indian IT Employees are in tension with Trump Dessication | Telugu Rajyam