ఇచ్ఛాపురంలో ముగిసిన జగన్ ప్రజా సంకల్ప యాత్ర

వైఎస్సార్సీపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో ముగిసింది. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సంధర్భంగా భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. జై జగన్… జై జై జగన్ అంటూ వారు నినాదాలతో హోరెత్తించారు.

జగన్ పైలాన్ స్థూపం వద్దకు చేరుకోగానే వేద పండితులు, మత పెద్దలు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. 341 రోజులు, 3648 కిలోమీటర్ల దూరం జగన్ నడిచారు. జనవరి 9 2019 న ఆయన ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్ప యాత్ర ముగించారు. 88 అడుగుల ఎత్తుతో ఇచ్ఛాపురంలో పైలాన్ ను నిర్మించారు.