యూట్యూబ్ లో చూస్తూ భార్యకు డెలివరీ.. ఏమైందంటే?

టెక్నాలజీ ఎంతలా పుంతలు తొక్కుతుందంటే వాడుకున్నవారికి వాడుకున్నంతలా తయారైంది.టెక్నాలజీతో మంచిగా అయ్యే వారు మంచి గా అవుతున్నారు. చెడ్డగా అయ్యేవారు  చెడ్డగా తయారువుతున్నారు. తమిళనాడులో ఎంత ఘోరం జరిగిందంటే యూట్యూబ్ లో చూస్తూ భార్యకు డెలివరి చేశాడో ప్రబుద్దుడు. ఫలితం నిండు ప్రాణం బలి. ఇంతకీ ఏం జరిగిందంటే..

తమిళనాడులోని తిరుపూర్ జిల్లాకు చెందిన కార్తికేయన్, కృతిక భార్యభర్తలు. కార్తికేయన్ నైట్ వేర్ ఏజన్సీలో పనిచేస్తుండగా, కృతిక ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. కృతిక రెండో సారి గర్భం దాల్చింది. వీరికి ఆధునిక వైద్యంపై నమ్మకం లేకపోవడంతో ఇంట్లోనే వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

కృతికకు నెలలు నిండటంతో ఇంట్లోనే డెలీవరీ చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. యూట్యూబ్‌లో how to help pregnant woman videos అని టైపు చేసి వాటిని చూశారు. అలానే డెలీవరి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ’ నెల 22న కృతికకు నొప్పులు రావడంతో యూట్యూబ్ లో చూసిన విధంగా కార్తికేయన్ భార్యకు ప్రసవం చేశాడు. కృతిక శిశువుకు జన్మనిచ్చింది. పాప క్షేమంగానే ఉంది. కానీ ఆ తర్వాత కృతికకు రక్తస్రావం అధికం కావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కృతిక ప్రాణాలను కోల్పోయింది. కృతిక మృతికి కారణమైన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాక్టర్లు వైద్యం చేస్తేనే ప్రాణాలకు గ్యారంటీ లేని ఈ రోజుల్లో ఈ దంపతులు అతి సాహసానికి పోయి ఉత్తగా ప్రాణం పోగొట్టుకుంది అని అంతా బాధను వ్యక్తం చేస్తున్నారు.