ఆ విషయంలో జనసైనికులను ఫాలో అవుతున్న తమ్ముళ్లు!

చంద్రబాబు జిల్లాల టూర్స్ అంటే చాలు.. పోలీసులకు పెద్ద పనే పడుతుంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు యాత్రలూ, బహిరంగ సభలూ నిర్వహిస్తే.. పెద్ద పెద్ద నాయకులకు సెక్యూరిటీ, ట్రాఫిక్ క్లియర్ చెయడం వంటివి మాత్రమే బాధ్యతలుగా ఉండేవి… కానీ మారుతున్న నేతల మాటతీరుకు తగ్గట్లు క్యాడర్ పద్దతి కూడా పూర్తిగా దారితప్పుతోంది. దీంతో పోలీసులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి కొంతమంది నాయకులు చేపట్టే యాత్రలు, సభలు! దీనికి కారణం… సరైన నాయకత్వం లేకపోవడమా.. లేక, కేడర్ లో క్రమశిక్షణ లోపించడమా అనే ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు!

తాజాగా చంద్రబాబు ప్రకాశం జిల్లా టూర్ లో భాగంగా.. యర్రగొండపాలెం వచ్చారు. రోడ్ షో చేశారు. బహిరంగ సభ పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. అది ప్రతీ రాజకీయనాయకుడి హక్కు కూడా. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ సమయంలో అదే ప్రాంతంలో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఆఫీసు ముందు టీడీపీ కార్యకర్తలు పిల్ల చేష్టలు చేశారు.. అదే ఈ రచ్చకు కారణం అని చెబుతున్నారు స్థానిక వైసీపీ నేతలు!

అవును… ఉత్సాహం ఆపుకోలేకపోయారో లేక, ఫ్రస్ట్రేషన్ లో బయటడిపోయారో కానీ.. అత్యూత్సాహం టీడీపీ తమ్ముళ్ళు బైకులపై ర్యాలీగా వెళ్తూ మంత్రి ఆఫీస్ ముందు గలాటా చేశారు! దీంతో… వైసీపీ నేతలకు, క్యాడర్ కు ఒళ్లు మండటం.. రచ్చకు దారితీయడం జరిగిందని అంటున్నారు. ఫలితంగా… టీడీపీ తమ్ముళ్ళు – వైసీపీ నేతల మధ్య ఒక రకంగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఇదే సమయంలో… కూల్ కి మారు పేరుగా ఉండే మంత్రి ఆదిమూలపు సురేష్ సడన్ గా రోహిణీ కార్తి సూర్యుడుగా మారిపోయారు! అవును… ఆదిమూలపు సురేష్ చొక్కా సైతం తీసేసి రొమ్ము చూపించేశారు. విప్లవవీరుడి గెటప్ తో రోడ్ల మీదకు వచ్చి తమ్ముళ్లను టెన్షన్ పెట్టారు. దీంతో… నిత్యం కూల్ గా ఉండే మంత్రిని ఈ స్థాయిలో రెచ్చగొట్టారంటే… దళితులవైపు వేళు చూపిస్తూ బాబు చేసిన అనైతిక చేష్టలు ఒక కారణం అయితే… ర్యాలీ పేరు చెప్పి తమ్ముళ్లు చేసిన చిల్లర చేష్టలు కూడా మరోకారణం అంటున్నారు!

దీంతో… చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మాట వాస్తవమే అయినా… టీడీపీ కార్యకర్తలు అయినా హుందాగా ఉండటం ఈ సమయంలో ఎంతో అవసరమని చూస్తిస్తున్నారు విశ్లేషకులు. సాధారణంగా… జనసైనికులు ఇలాంటి విషయాల్లో వెనకా ముందూ చూడకుండా దూకుడు ప్రదర్శిస్తారనే విమర్శ ఉంది.. కానీ, టీడీపీ నేతలకు అంత పెద్ద విమర్శ లేదు! అయితే… గతకొన్ని రోజులుగా చంద్రబాబు సభల్లో జనాలు సరిగా లేకో, ఏమో కానీ… తమ్ముళ్లు సైతం ఫ్రస్ట్రేట్ అవుతూ, తమ సహజ శైలికి భిన్నంగా నడుచుకుంటూ జనసైనికులను ఫాలోఅవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!