రేసులోకి దూసుకొచ్చిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్.!

ఎవరన్నారు అనిల్ కుమార్ యాదవ్‌కి వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ నిరాకరించిందని.? ఔను, ఎవరన్నారని.? ఏం, ఎందుకు అనకూడదు.? రాజకీయాల్లో చాలా వుంటాయ్. చాలా సమీకరణాలు వుంటాయ్.! ఎప్పటికప్పుడు అవి మారుతుంటాయ్.

నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యక్రమాల్ని సరిగ్గా నిర్వహించడంలేదనీ, స్థానిక నాయకత్వాన్ని కలుపుకుపోవడంలేదనీ, జిల్లాకి చెందిన వైసీపీ ముఖ్య నేతలతో విభేదాలు పెంచుకుంటున్నారనీ.. ఇలా అనిల్ కుమార్ యాదవ్ మీద చాలా చాలా ఆరోపణలు వచ్చాయి. వస్తూనే వున్నాయి.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన అనిల్ కుమార్ యాదవ్, ఆయా వ్యవహారాలపై అధినేత వద్ద తన ఆవేదనను వినిపించారట. పరిస్థితులు చక్కబడ్తాయ్.. అని అధినేత వైఎస్ జగన్ ఆయనకు సూచించారట కూడా.

కానీ, ఎక్కడో చిన్న డౌటానుమానం. అనిల్ కుమార్ యాదవ్‌ని వైఎస్ జగన్ లైట్ తీసుకుంటున్నారని, ఆ దిశగా ఆయనా వేరే ఆలోచనలు చేసినట్లుగా గుసగుసలూ వినిపించాయి. కానీ, ఈక్వేషన్స్ అనూహ్యంగా మారాయ్.

అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ రేసులోకి దూసుకొచ్చారు. ‘బస్తీ మే సవాల్’ అంటున్నారు. ‘మళ్ళీ అసెంబ్లీకి వెళతా.. నన్నెవడు ఆపేది.? జగనన్న దయతలిస్తే, మళ్ళీ మంత్రినవుతానేమో..’ అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్.

అదేంటీ, టీడీపీతోనూ అలాగే జనసేనతోనూ అనిల్ టచ్‌లోకి వెళ్ళారనే గుసగుసలు వచ్చాయి కదా.? అంటే, అదంతే.!