జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద నానా రకాల విమర్శలూ చేసిన ఘనాపాటి ఆయన. అధినేత మెప్పు కోసం, తాను మంత్రినన్న విషయాన్ని సైతం మర్చిపోయి, అడ్డగోలు వ్యాఖ్యలు, దారుణమైన విమర్శలు చేసేశారు ఆయనగారు. ప్చ్.! ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రిగా తనను కొనసాగిస్తారని చాలా చాలా ఆశలు పెట్టుకున్న ఆయనగారికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.
తన సామాజిక వర్గంలోనూ పలచనైపోయి మరీ పవన్ కళ్యాణ్ మీద దిగజారుడు విమర్శలు చేసిన సదరు మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. తప్పక, ఇతర పార్టీల మీద ఇప్పటికీ విమర్శలు చేస్తూ, సెటైరికల్‌గా టైమ్ పాస్ చేస్తున్న ఆ మాజీ మంత్రి, వేరే పార్టీతో టచ్‌లో వున్నారంటూ సొంత పార్టీ నుంచే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రి.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే సదరు మాజీ మంత్రిగారి మీద ఆరోపణలు చేస్తున్న ఎంపీగారు కూడా వేరే పార్టీతో టచ్‌లోకి వెళ్ళారట. ఇద్దరూ టచ్‌లోకి వెళ్ళింది ఒకే పార్టీ కావడంతో, అక్కడ తమ పెత్తనం చెలాయించడానికి వీలుగా ఇప్పటినుంచే ఆధిపత్య పోరుకు తెరలేపారట.
‘ఇద్దరూ పార్టీ నుంచి జంప్ చేయడం ఖాయం. ఈలోగా పార్టీ పరువు తీసెయ్యడానికి ఇద్దరూ ఫిక్సయినట్టున్నారు..’ అంటూ అధినేత వైఎస్ జగన్ వద్దకు సమాచారం కూడా అందిందట సదరు మాజీ మంత్రి గురించీ, సదరు ఎంపీ గురించీ. ఈ విషయమై ఆరా తీసిన ముఖ్యమంత్రి, ఇద్దరినీ పిలిచి క్లాస్ తీసుకోవాలా.? లేదంటే, ఒకర్ని లైట్ తీసుకుని, ఇంకొకర్ని కాపాడుకోవాలా.? అన్నదానిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.