అంబటి రాంబాబుపై మూకుమ్మడి దాడి ఎందుకంటే.!

Ambati Rambabu

Ambati Rambabu : మంత్రి అంబటి రాంబాబు మీద తెలుగుదేశం పార్టీ పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఎందుకబ్బా.? మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకింత బరితెగించారు. అంబటి వర్సెస్ అయ్యన్న.. ఈ బరితెగింపు అనూహ్యమైన స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కాదు, చాలామంది ఆడాళ్ళ పేర్లను పరోక్షంగా ఇద్దరూ బజారుకీడ్చేశారు.

మంత్రిగా వున్నప్పుడు కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద చేసిన తీవ్ర దూషణలు అందరికీ గుర్తుండే వుంటాయ్. అంతకు మించి, ఆయన ఇప్పుడు కూడా చంద్రబాబు మీద తిట్ల వర్షం కురిపిస్తున్నారు. కానీ, కొడాలి నాని విషయంలో టీడీపీ ఇంతలా బరితెగించలేదు.

మరి, అంబటి ఎందుకు టీడీపీకి సాఫ్ట్ టార్గెట్ అయ్యారు.? అంటే, కొడాలి నాని సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం ఒకటే గనుక.. అన్న సమాధానం వస్తోంది. రాజకీయాల్ని కులాల ప్రాతిపదికన విశ్లేషించడం ఎంతవరకు సబబు.? అంటే, జరుగుతున్న వ్యవహారం అలాగే వుంది మరి.

ఇందులో తప్పెవరిది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇద్దరూ కలిసి రాజకీయాల్ని బజారుకీడ్చేశారు. మంత్రి స్థాయిలో అంబటి, ఇంత జుగుప్సాకరంగా వ్యవహరించడం అత్యంత బాధాకరం. ప్రతిపక్షంలో వున్నాం కాబట్టి ఏదనా మాట్లాడతామని టీడీపీ అనుకుంటే, అసలంటూ రాజకీయ తెరపై తెలుగుదేశం పార్టీ కనిపించని స్థాయికి జనం ఆ పార్టీని తరిమికొట్టేసే ప్రమాదం లేకపోలేదు.

వైసీపీ కూడా, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని విపక్షాల విమర్శలపై స్థాయికి తగ్గట్టు స్పందిస్తే మంచిది.