వై నాట్ 175.! నో కాంప్రమైజ్ అంతే.!

అసలెలా సాధ్యం.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అన్ని నియోజకవర్గాల్నీ గెలవగలమని వైసీపీ అంటోంటే.. సహజంగానే వచ్చే ప్రశ్న ఇది.. ఇదెలా సాధ్యమని.! కానీ, వైఎస్ జగన్ మాత్రం గట్టిగానే.. అదే పట్టుదలతో కనిపిస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘వై నాట్ 175’ నినాదాన్ని ఏదో ఉత్తనే మొదలు పెట్టలేదు. ‘ప్రజలకు మేలు చేస్తున్నాం.. మళ్ళీ గెలిపించమని అడుగుతాం.. గెలుస్తాం..’ అంటున్నారు వైఎస్ జగన్.. పార్టీ ముఖ్య నేతల సమావేశాల్లో.

సో.. వైఎస్ జగన్ గట్టి నమ్మకంతోనే వున్నారన్నమాట.! ఏ పార్టీ అధినేతకైనా ఈ నమ్మకం వుండి తీరాల్సిందే. టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు.. మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించలేకపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సంగతి సరే సరి.

ఇదే వైసీపీకి అడ్వాంటేజ్.! విపక్షాలేమో పొత్తులు లేకుండా ఎన్నికల్ని ఫేస్ చేసే పరిస్థితి లేదు. అయితే, ఒక్కటే సమస్య వైసీపీకి.! సిట్టింగ్ ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రుల విషయమై, ప్రజల్లో ఒకింత అసహనం వుంది.

సంక్షేమ పథకాలు అందుతున్నాయ్.. కానీ, అభివృద్ధి జరగడంలేదన్న భావన ప్రజల్లో వుంది. స్థానిక ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయడంలేదనే ఆవేదన ప్రజల్లో వున్నా, ఆ నెగెటివిటీ ముఖ్యమంత్రి మీద ప్రజల్లో అంతగా కనిపించకపోవడం గమనార్హం.

కేవలం వైఎస్ జగన్ ఫొటోని చూసి ఓటర్లు ఓట్లేసే పరిస్థితి వుంటుందా.? అంటే, 2019 ఎన్నికల నాటి పరిస్థితి వేరు.! అప్పట్లో కేవలం వైఎస్ జగన్ ఫొటోని చూసే జనం ఓట్లు గుద్దారు. 151 సీట్లు వైసీపీకి వచ్చాయి. ఇప్పుడలా కాదు.. వైఎస్ జగన్ ఎంత నమ్మకంగా వున్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేల కారణంగా వైసీపీకి చిక్కుల తప్పకపోవచ్చు.