వైసీపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కృష్ణా జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. వంగవీటి రాధాకృష్ణ విజయవాడ సెంట్రల్ సీటును కోరుతుండగా, ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం  విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయాలని సూచించారు. దీంతో మనస్థాపం చెందిన రాధ గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంకాగా, విజయసాయిరెడ్డి సహా పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఆయన్ను సముదాయించారు. తాజాగా ఆదివారం వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ వంగవీటి రాధాకృష్ణతో దాదాపు గంటకు పైగా చర్చించారు. పార్టీలోనే కొనసాగాలని సూచించారు.

అయితే విజయవాడ సెంట్రల్ ఇస్తేనే పార్టీలో ఉంటానని వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. దీంతో బొత్స నిరాశగా వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ వైసిపికి రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం నేపథ్యంలో ఇటీవల రంగా, రాధా మిత్రమండలి సమావేశం నిర్వహించిన రాధ.. అనుచరులు, మద్దతుదారులతో సుదీర్ఘంగా చర్చించారు. వంగవీటి రాధాకృష్ణ  టీడీపీలో చేరతారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అన్న విషయం పై క్లారిటి లేదు. మొత్తానికి రాధా రాజీనామా వైసిపికి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చని చర్చ జరుగుతోంది.   

వంగవీటి రాధ వైఎస్ జగన్ కు రాసిన లేఖ