వంగవీటి రాధా టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో బుధవారం ఆయన టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబుతో దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

భేటీ సందర్భంగా వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చంద్రబాబు దృష్టికి వంగవీటి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తన లక్ష్యం కాదని… వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా చెప్పారు. మరోవైపు, ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని రాధాకే చంద్రబాబు వదిలేశారు.