మూడు వీఆర్వో ఎగ్జామ్ సెంటర్ల మార్పు

తెలంగాణ వ్యాప్తంగా వీఆర్వో పరీక్ష ఆదివారం నిర్వహిస్తున్నారు. అయితే పరీక్షా కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేస్తూ టిఎస్ పీఎస్సీ వేరే సెంటర్లు కేటాయించింది. కేవలం 24 గంటల సమయం ఉన్నప్పుడు ఎగ్జామ్ సెంటర్లు మార్చడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల వలనే పరీక్ష సెంటర్లను మార్చుతున్నామని అభర్దులు అర్ధం చేసుకోవాలని టిఎస్ పీఎస్సీ కోరింది.

సెంటర్ల కేటాయింపులో అన్యాయంగా వ్యవహరించారని ఎక్కడో దూరంగా వేశారని అభ్యర్దులందరికి ఇబ్బందులు ఎదురయ్యేలా జిల్లా సరిహద్దులు దాటి మరీ ఏర్పాటు చేశారని వారు విస్మయం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాలు మారిన వివరాలిలా ఉన్నాయి.

సరూర్‌నగర్‌లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో (సెంటర్‌కోడ్- 39124) పరీక్షకు హాజరుకావాల్సిన 600 మంది (హాల్‌టికెట్ నంబర్ 1339063388 నుంచి 1339063987 వరకు) పరీక్షాకేంద్రాన్ని దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలకు (బాయ్స్) మార్చారు. సరూర్‌నగర్ శ్రీచైతన్య కాలేజీలోని (సెంటర్-39133) 500 మంది (1339068548-1339069047) పరీక్ష కేంద్రాన్ని మూసారాంబాగ్‌లోని నారాయణ జూనియర్ కాలేజీకి (బాలికలు) మార్చారు. దిల్‌సుఖ్‌నగర్ న్యూనోబుల్ డిగ్రీ కాలేజీ (సెంటర్-39137)లోని 450 మందికి (హాల్‌టికెట్ నంబరు 1339070504 నుంచి 1339070953) మూసారంబాగ్‌లోని వెలాసిటీ కాలేజీలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు.