హైదరాబాద్ లో దుర్గామాత నిమజ్జనంలో అనుకోని సంఘటన జరిగింది. అధికార టిఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగింది. కార్పొరేటర్ నాయకత్వంలో కాంగ్రెస్ నేతలపై దాడికి యత్నించారు టిఆర్ఎస్ నేతలు. పూర్తి వివరాలు చదవండి. కింద ఉన్న వీడియో కూడా చూడండి.
మల్కాజ్ గిరిలో దుర్గామాత కు నవరాత్రులు నిష్టతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారిని ఊరేగించి నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరికాసేపట్లో అమ్మవారి నిమజ్జనం పూర్తవుతుందనగా టిఆర్ఎస్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, ఆయన అనుచరులు శోభాయాత్రలో చిచ్చు రేపారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
జగదీష్ గౌడ్, ఆయన అనుచరులు దాడులకు ప్రయత్నం చేయడంతో స్థానిక ప్రజలు, భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో అరెస్టయి జైలు పాలైన అభిషేక్ గౌడ్ తండ్రే జగదీష్ గౌడ్.
అమ్మవారి ముందే కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతల ఫైటింగ్ వీడియో చూడండి.