జగన్ సర్కార్ 15,000 కోట్ల అవినీతి.. అసలు లెక్కలు తెలుసా పవన్?

ఏపీలో అధికారంలో జగన్ సర్కార్ జగనన్న కాలనీల ద్వారా ఏకంగా 15,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని పవన్ కళ్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే జగన్ సర్కార్ నిజంగానే ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిందా? అనే ప్రశ్నలకు అసలు అవినీతికే పాల్పడలేదనే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కోసం చేసిన ఖర్చు 11 వేల కోట్ల రూపాయలుగా ఉంది.

 

అయితే ఖర్చు 11,000 కోట్ల రూపాయలు ఉంటే అవినీతి 15,000 కోట్ల రూపాయలుగా ఎలా ఉంటుందని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ పై విమర్శలు చేయడం చేత కాక పవన్ ఈ తరహా కామెంట్లు చేస్తున్నారని మరి కొందరు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జగనన్న కాలనీలకు భూ సేకరణ జరిగింది. ఇందుకోసం జగన్ సర్కార్ 70,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించింది.

 

భూ సేకరణ చట్టం ప్రకారమే ప్రభుత్వం భూములను కొనుగోలు చేయడం జరిగింది. మార్కెట్ వాల్యూ ప్రకారమే జగన్ సర్కార్ రైతులకు నష్ట పరిహారం చెల్లించింది. ఎక్కడా మధ్యవర్తులు లేకుండానే ప్రభుత్వం భూములను కొనుగోలు చేయడం జరిగింది. అవినీతికి ఎక్కడా ఆస్కారం లేకుండా ప్రభుత్వం భూ సేకరణ చేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ను నిందించటమే లక్ష్యంగా జనసేన వ్యవహరిస్తోంది.

 

టీడీపీ అవినీతి చేసినా నోరు మెదపని పవన్ వైసీపీ అవనీతి చేయకుండానే చేసిందనే అర్థం వచ్చేలా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. మరోవైపు పవన్ పొత్తులకు సంబంధించి స్పష్టత ఇవ్వని పక్షంలో భారీస్థాయిలో నష్టపోయే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.