ఇదేం కర్మ చంద్రబాబు.. ప్రజలు ఛీ కొడితే ఏం చేస్తావంటూ?

TDP

ఏపీ ప్రజల్లో చంద్రబాబు నాయుడుపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పడానికి 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో కేవలం 13 శాతం సీట్లలో మాత్రమే టీడీపీ విజయం సాధించిందంటే తెలుగుదేశంకు ఇంతకు మించిన అవమానం ఉండదు. 2024 ఎన్నికల్లో కూడా పొత్తులు లేకపోతే ఓటమి గ్యారంటీ అని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే తాజాగా టీడీపీ ఇదేం కర్మ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధం కాగా చంద్రబాబు నాయుడుకు ఇదేం కర్మ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లడానికి ఇలాంటి వెరైటీ కార్యక్రమాలను ప్లాన్ చేస్తే టీడీపీ ప్రజల్లో చులకన కావడం గ్యారంటీ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థులు లేరు.

రాయలసీమ జిల్లాలలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇవ్వడం కూడా కష్టమేనని తెలుస్తోంది. పులివెందులలో జగన్ ను ఓడిస్తానని సవాల్ విసురుతున్న చంద్రబాబు ఇప్పటివరకు ఎందుకు ఓడించలేకపోయారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు విమర్శలు చేస్తున్నా ఆ విమర్శలు నిజమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. వైసీపీపై విమర్శలు చేయడం వల్ల లాభం ఏంటని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచనల విషయంలో మారాల్సిన అవసరం ఉంది.