ఏపీ సీఎం జగన్ ప్రజా పథకాలతో ప్రజలకు చేరువయ్యారు. తన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి విజయం సాధించారు. ఎవరన్నా అడిగితే అన్న వస్తున్నాడని చెప్పండి అంటూ ఎందరో చెల్లెమ్మలకు జగన్ భరోసానిచ్చాడు. వయసుపైబడిన వారికి కొడుకుగా మారి పింఛన్లను ఇచ్చాడు. అన్నదాతలను అక్కున చేర్చుకుని వారికి కొండంత అండగా నిలిచాడు. ఇంతకి ప్రజాభిమానం సంపాదించుకోవడం అంత సులువైన పని కాదు.
ఏపీలో వైసీపీని స్థాపించిన పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. ఈ పది సంవత్సరాల కాలంలో వైసీపీకి అండగా నిలిచిన నాయకులు చాలా మందే ఉన్నారు. అదే సమయంలో పార్టీకి సహకరించని వారు కూడా ఉన్నారు. ప్రత్యర్ధి పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తమకు అండగా నిలిచిన అధికారులు, సూచనలు, సలహాలు ఇచ్చిన వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ గుర్తుపెట్టుకుని మరీ సీఎం జగన్ పదవులు ఇచ్చి కొత్త రికార్డులు సృష్టించారు.
ఇండియాలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఒక్కో స్కీమ్ ను తీసుకొచ్చి అందరికీ అండగా జగన్ నిలబడ్డారు. అలాగే పాలనలో విధేయులకు పదవులు ఇవ్వడంలోనూ ఆయన రికార్డులు బద్దలు కొట్టారు.
గతంలో టీడీపీ సర్కార్ జన్మభూమి పేరుతో ప్రజలను వేధిస్తే, ఇప్పుడు సీఎం జగన్ అలాంటివేవీ పట్టించుకొకుండా ప్రతి ఇంటికి తన సంక్షేమ పథకాలు చేరేలా చేశాడు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. గత ప్రభుత్వాల టైంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారు. కానీ ఇప్పుడు ప్రజల చుట్టూ అధికారులు తిరిగి వారి సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఘనత సాధించిన జగన్ రాబోవు ఎన్నికల్లో కూడా అద్భుత విజయాన్ని సాధిస్తారని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.