షాకింగ్ న్యూస్: ఇథియోపియా విమాన ప్రమాద మృతుల్లో తెలుగమ్మాయి

ఇధియోపియా విమదనా ప్రమాదం లో చనిపోయిన నలుగురు భారతీయుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన డా. నూకవరపు మనీషా కూడా ఉన్నారు.

ఆదివారం ఉదయం ఈ విమానం  బోయింగ్ 737 కూలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తంగా 149 మంది ప్రయాణికులు చనిపోయారు. వారినలుగురు భారతీయులు. మనీషా కాకుండా వైద్యా పన్నాగేష్ భాస్కర్, వైద్య హన్సినీ పన్నాగేష్, షికా గర్గ్ ఉన్నారు. ఇందులో షికా గర్గ్ యుఎన్ డిపి కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు.

గుంటూరు కు చెందిన ఎన్ వెంకటేశ్వరరావు, భారతిల రెండో కూతరు మనీషా. ఆమె గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదివారు. తర్వాత ఎంస్ డిగ్రీ కోసం ఆమె అమెరికా వెళ్లారు.

అమెరికాలోని టెన్నిసీ జాన్సన్ సిటీలో ఆమె ఇంటర్న్ షిప్ కూడా చేస్తున్నాారు. ఆమె ఎడిస్ ఎబాబా విమానంలో ఇధియో పియా వెళ్తారు. తర్వాత అక్కడి నుంచి కెన్యాకు మరొక విమానంలో బయలు దేరారు.

ఆమె సోదరికి ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఈ సందర్భంగా కెన్యాలో ఉన్న సోదరిని చూసేందుకు వెళ్తున్నారు.

ఎదిస్ ఎబాబాలో బయలు దేరిన కొన్ని నిమిషాల్లోని ఈ విమానం కూలిపోయింది. మృతుల్లో మనీష కూడా ఉన్నట్లు సమాచారం అందింది.

ఆమె తల్లితండ్రులిపుడు నైరోబీలో ఉన్నారు. ఇది ప్రమాద స్థానికి రెండుగంటల దూరంలో ఉంటుంది.