ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సర్వే సంస్థల పేర్లు చెబుతూ కొన్ని సర్వేలు తెగ వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి 2019 ఎన్నికల ముందు వైసీపీ విజయం సాధిస్తుందని చాలా సర్వే సంస్థలు అంచనా వేసినా 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఏ సర్వే సంస్థ కూడా అంచనా వేయలేకపోయింది. అయితే టీడీపీ ప్రస్తుతం ఫేక్ సర్వేలతో వైసీపీ పరువు తీయడానికి ప్రయత్నిస్తోంది.
వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 40 కంటే ఎక్కువ సీట్లు రావనే విధంగా టీడీపీ ప్రచారం చేస్తుండటం గమనార్హం. అయితే ఈ సర్వేలు కనీసం నమ్మే విధంగా ఉండాలి కదా అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 2014లోనే వైసీపీ 67 సీట్లలో విజయం సాధించిందని రాయలసీమ అంతటా వైసీపీ హవా కొనసాగుతోందని వైసీపీకి ఇంత తక్కువ స్థాయిలో సీట్లు వస్తాయంటే ఎలా నమ్మాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉంది. అయితే అదే సమయంలో హిస్టరీ రిపీట్ చేయాలని కనీసం 150 సీట్లలో పార్టీ విజయం సాధించాలని భావిస్తుండటం గమనార్హం. 175 సీట్లలో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంటే అన్ని సీట్లలో కాకపోయినా మెజారిటీ సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తుండటం గమనార్హం.
జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాయకుల వారసులకు అవకాశం ఇవ్వాలని అనుకోవడం లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. వారసులకు సీట్లు కేటాయించడం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ కు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే మరో 30 సంవత్సరాల పాటు ఏపీలో వైసీపీనే అధికారంలో ఉంటుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.